మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మంథని నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి నేడు కాళేశ్వరంలో బిజెపి శ్రేణులను కలుపుకొని రెండవ రోజు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించి ప్రతి వాడలో ఇంటింటికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజల దగ్గరికి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకొని మాట్లాడుతూ,ఈ అవినీతి బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రస్తుతం జరిగే పరిస్థితులు, వర్షాభావంతో మేడిగడ్డ ప్రాజెక్టు వలన రైతులకు జరిగిన నష్టాలు, దరిద్రపు ధరణితో రైతులకు భూ సమస్యల వివాదాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించకపోవడం, అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు రాకపోవడం, ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్య, వసతులు కల్పించకపోవడం, ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, ఉచిత కంటి పరీక్షలని పెట్టి ఇచ్చే అద్దాలతో కంటి చూపు ఉన్న కండ్లను కనబడకుండా చేయడం, గీతా కార్మికులకు 50 సంవత్సరములకు పెన్షన్ అందించకపోవడం, నిరుపేదలకు మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పంట లోన్లు మాఫీ, ఇన్ని మోసపూరిత ఉచిత హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేజిక్కించుకొని అవినీతి అక్రమాల నియంత పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు వీడ్కోలు పలికి, గతంలో పాలించిన వర్గాల తగాదల ప్రభుత్వాన్ని కూడా దరిచేరనీయకుండా, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి మార్పు కోరుకొని ఒకసారి బిజెపి పార్టీకి అవకాశం కల్పించి కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే, రైతులకు న్యాయం,పరిశ్రమల ఏర్పాటు, ప్రాంత ప్రజలకు ఇబ్బందుల సమస్యలను తొలగించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


Post A Comment: