మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర*స్ఫూర్తితో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గం లో గోదావరిఖని లక్ష్మీ నగర్ 50వ డివిజన్, 31వ డివిజన్ లో *హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పొచమ్మ గుడిలో మొక్కులు చెల్లించుకొని యాత్రను మొదలుపెట్టారు. ఇంటి ఇంటికి తిరిగి BJP, BRS ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించి, *కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్దిని తెలియజేశారు. అలాగే రైతుల కోసం రూపొందించిన *వరంగల్ రైతు డిక్లరేషన్*గురించి తెలిపి, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఒసిపి 5తో ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్నారని ఆరోపించారు, ఈ ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థలు ఉన్న కూడా స్థానిక యువతకు ఉద్యోగాలు లేక డబ్బులు పెట్టి మోసపోతున్నారని అన్నారు. మాయమాటలు తో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, ఎం రవికుమార్, ముస్తఫా, గాదం విజయానంద్, పెద్దెల్లి తేజస్విని- ప్రకాష్, బొమ్మక రాజేష్, గట్ల రమేష్, తాళ్లపల్లి యుగంధర్, పంజా శ్రీనివాస్, మారేలి రాజిరెడ్డి, చుక్కల శ్రీనివాస్, నాజిమొద్దిన్, ఉమ్మతల దేవేందర్ రెడ్డి, రమణ రావు, తిప్పరపు శ్రీనివాస్, కోలని వెంకట్ రెడ్డి, మహ్మద్, ఆసిఫ్ పాషా, హరి ప్రసాద్, సమ్మెట స్వప్న, కౌటం సతీష్, ఎంచర్ల మహేష్, దాసరి విజయ్, ఉదయ్, పీక అరుణ్ కుమార్,దూళికట్ట సతీష్,గాదె సుధాకర్, కుడిదల శివ మహిళ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: