మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతదేశ కమ్యూనిస్టు విప్లవ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ "శతజయంతి సభ" కేంద్ర కమిటీ పిలుపు లో బాగంగా ఈ నెల 20.న హైద్రాభాద్ లో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తుంది, ఈ సభ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రామగుండం లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యుల సమావేశంలో *CPI(ML) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కే రాజన్న మాట్లాడుతూ... ది: 30-01-1923 లో కామ్రేడ్ సత్యనారాయణసింగ్ బీహార్ రాష్ట్రంలోని దామార్ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారని, "యస్.యన్.యస్" తన చివరి శ్వాస వరకు పీడిత ప్రజలు వైపు నిలిచి పోరాటాన్ని నడిపించాడని అన్నారు, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని దేశంలో విప్లవ ఉద్యమానికి అన్వయించి అభివృద్ధి చేయటానికి కృషి చేసిన ప్రముఖ నాయకుల్లో తాను ఒకరిని అన్నారు, అతివాద, మితవాద తప్పులకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ సిద్ధాంత పోరాటంలో ముందు వరుసలో నిలిచిన నాయకుల్లో తాను ఒకరిని అన్నారు, అట్లాంటి కామ్రేడ్ ను స్మరించుకోవడం అంటే మనల్ని మనం సమీక్ష చేసుకోవడమని అన్నారు అందులో భాగంగానే ఈనెల 20న. హైద్రాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5.30 నిమిషాలకు కామ్రేడ్ సత్యనారాయణసింగ్ శత జయంతి" సభలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు *ఐ కృష్ణ, ఈ నరేష్, చిలుక శంకర్, డివిజన్ నాయకులు సిహెచ్ అబేద్నేగో, మల్యాల దుర్గయ్య, కే మల్లేశం, మేరుగు చద్రయ్య, పి రమేష్, కే జ్యోతి, వి సదానందం, కోండ్ర మొగిలి, కె లింగమూర్తి, ఆరుముళ్ళ తిరుపతి, సమ్మెట తిరుపతి, మాలెం తిరుపతి భుషిపాక సాగర్, ఇ బాబు, కిషన్*తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: