మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిజేపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని తబితా పిల్లల సంరక్షణ ఆశ్రమంలో బిజేపి పార్టీ బసంత్ నగర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమారపు అరుణ్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు కంది అశోక్,నాయకులు దర్మాజి రాకేష్, బోధస్ సతీష్, సురా ఆనంద్, నీరజ్ యాదవ్, భాస్కర్, వీరితో పాటు కుక్కల గూడుర్ గ్రామ నాయకులు ఉన్నారు.

Post A Comment: