ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు.
హనుమకొండ జిల్లా సమస్యలు - పరిష్కారాలపై మంత్రి వివరించారు.
జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ గా, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, నాయకులు - అధికారులతో సమన్వయం చేసుకుని వెళ్లాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Post A Comment: