మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పరిధి రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీ కి చెందిన శనిగారపు దుర్గయ్య సెంట్రింగ్ పని చేస్తూ ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబాన్ని ఎల్లదిస్తున్న శనిగారపు దుర్గయ్య ఇటీవల అనారోగ్యంకు గురికాగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా దుర్గయ్య కు టిబిగా నిర్ధారణ అయిందని కుటుంబీకులు తెలిపారు రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గయ్య అనారోగ్యంతో మంచంనికే పరిమితం కాక ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న యజమాని మంచానపడడంతో ఇంట్లో తినడానికి బియ్యం నిత్యవసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబీకులు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు సమాచారం ఇవ్వగా  పీకే రామయ్య కాలనీ యూత్ నాయకులు సంజీవ్ ప్రసాద్ ద్వారా 25 కిలోల బియ్యం మరియు నిత్యవసర సరుకులను పంపించడం జరిగిందని ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు  బియ్యం అందజేసిన అనంతరం సంజీవ్ ప్రసాద్ మాట్లాడుతూ రెండో వార్డులో ఎవరికి ఆపద వచ్చిన మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి బాధిత కుటుంబాల గురించి తెల్పగానే వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని బాధిత కుటుంబాలను ఆదుకుంటు దాతృత్వం చాటుతున్న మడిపెల్లి మల్లేష్ అన్న కు మరియు సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులందరికి పేరుపేరునా మా రెండోవ వార్డు పీకే రామయ్య కాలనీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సంజిప్ తెలిపారు శనిగారపు దుర్గయ్య కుటుంబ పరిస్థితి మల్లేష్ అన్నకు తెలుపగానే స్పందించి  బియ్యం నిత్యవసర సరుకులు బాధిత కుటుంబానికి అందజేయవలసిందిగా మాకు మల్లేష్ అన్న ఆదేశించగా వారి ఆదేశాల మేరకు  శనిగారపు దుర్గయ్య కుటుంబానికి బియ్యం అందజేశామని సంజీవ్ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ సత్నాని. ముత్యాల లక్ష్మణ్. రాంప్రసాద్. హేమంత్. ధనంజయ్.సొనులాల్.ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: