మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ ద్వారకా నగర్ లో నిత్యం రద్దీగా ఉండే కాలనీలో రహదారుల వెంట నిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటారు అక్కడ మూల మలుపుల వద్ద ఏపుగా పెరిగిన తుమ్మ చెట్ల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని డివిజన్ ప్రజలు కార్పోరేటర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి రామగుండం మున్సిపల్ అధికారులకు తెలియజేసి మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతో జెసిబి తో రోడ్డుకు అడ్డంగా ప్రమాదాలకు కారణం అవుతున్న చెట్ల పొదలను తీసివేయడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ:- రామగుండం ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆదేశానుసారం డివిజన్ ప్రజలు ప్రమాదాలకు కారణమైన మూలమలుపుల వద్ద ఉన్న చెట్ల పొదలను రామగుండం మున్సిపల్ అధికారులకు వివరించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మేరకు వారు వెంటనే స్పందించి జెసిబి తో చెట్లపొదలను తొలగించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన రామగుండం మున్సిపల్ అధికారులకు మరియు వారి సిబ్బందికి డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంట యువకులు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు

Post A Comment: