మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బిజెపి నాయకులు సోమారపు అరుణ్ కుమార్ జన్మదినం సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ *సోమారపు సత్యనారాయణ అరుణ్ అభిమానులు అందరూ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం మరియు రోగులకు పండ్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సోమారపు అరుణ్ రామగుండం నియోజకవర్గంలోని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందించి వారికి తక్షణమే సహాయమందించి వారికి ధైర్యాన్ని ఇస్తారు అదేవిధంగా తమను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటారని తెలిపారు కాబట్టి అరుణ్ జన్మదినంప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించి పేదలకు బియ్యం పంపిణీరక్తదానం వంటి సమాజసేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు కోదాటి ప్రవీణ్, ఎతిరాజ్ సురేష్, దాసరి కిషోర్, సంజీవ్,బండి రాము,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: