మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని, అమరజీవి ప్రజా కళాకారుడు జాకబ్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక సభకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు అయి నివాళులు అర్పించారు. కవి రచయిత అమరజీవి కామ్రేడ్ జాకబ్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో, గోదావరిఖని భాస్కరరావు భవన్లో జాకబ్ స్మారక సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కామ్రేడ్ జాకబ్ చిత్రపటానికి నివాళులర్పించినారు. అనంతరం
గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగే వర్ధంతి సభలో సిపిఐ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి పాల్గొని ప్రసంగించారు. క్రీడల్లో అత్యంత ప్రతిభను చూపి, 50సంవత్సరాల సుదీర్ఘ క్రీడా చరిత్ర కల్గి, సింగరేణి ఖ్యాతిని దశ దిశల ఛాటిన మడక జేమ్స్ ని చాడ వెంకటరెడ్డి శాలువా కప్పి, షీల్డ్ తో సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యనియన్ (ఏ. ఐ.టీ. యు.సి.) బ్రాంచి కార్యదర్శి, మడ్డి ఎల్లాగౌడ్, కవి రచయిత గాయకుడు స్వామి చీకటి అంజయ్య కాసర్ల మల్లేష్ ప్రజా గాయకులు నాగన్న అధిక సంఖ్యలో కళాకారులు కార్యకర్తలు, కార్మిక సోదరులు, సానుభూతి పరులు, అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేసినారు.

Post A Comment: