ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా వరంగల్ మరియు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, యం.కృష్ణమూర్తి జిల్లా కోర్టు న్యాయ సేవా సదనం బిల్డింగ్ల్ లో ఒమేగా బన్ను హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరము ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన పెంచడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4 న అంతర్జాతీయ క్యాన్సర్ రోజుగా జరుపుకోవడం జరుగుతుంది.
ప్రజలలో క్యాన్సర్ పట్ల అవగాహన ఉంటేనే, దాని బారిన పడకుండా జాగ్రత్త పడగలం.
మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనకు తెలియకుండానే క్యాన్సర్ వ్యాధికి దగ్గరవుతున్నాము, వ్యాధికి గల కారణాలు, వ్యాధి లక్షణాలు, నివారణ ఉపాయాల పట్ల అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చును. క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండి, సరైన నియమ నిబంధనలు పాటిస్తే క్యాన్సర్ ను ఎదుర్కొనవచ్చును. చాలా క్యాన్సర్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేస్తే నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని తెలిపారు.
హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ "క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే ప్రమాదం బారిన పడకుండా, ఆ వ్యాధిని నివారించగలం. కనుక సంవత్సరానికి ఒకసారైనా ప్రివెంటివ్ చెక్-అప్ చేసుకోవాలి.క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకు లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చు.
క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలి.
క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం మరియు క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే రోగులకు తగిన చికిత్స మరియు సంరక్షణ ద్వారా కూడా క్యాన్సర్ భారాన్ని తగ్గించవచ్చు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఒమెగా బన్ను హాస్పిటల్ వారి సహకారాన్ని అభినందించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పద్మజ, యం.వెంకటేశ్వరరావు, వరంగల్ మరియు హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు జె.ఉపేందర్ రావు, బి.శ్రీనివాసులు మరియు ఇతర న్యాయమూర్తులు, ఒమెగా బన్ను హాస్పిటల్ నుండి డా.శ్రీవల్లి (క్యాన్సర్ నిపుణులు), డా.భగీరథ్ (కార్డియాలజిస్ట్), యం.ప్రవీణ్ కుమార్, ఉదయ్ కుమార్, కుమారస్వామి మరియు పారా మెడికల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం లో సుమారు 150 మంది కోర్టు సిబ్బంది ఈ.సి.జి., గర్భాశయ ముఖద్వార, ఎర్ర రక్త కణాల పరీక్షలు తదితర పరిక్షలు నిర్వహించుకోవడం జరిగింది.


Post A Comment: