మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు
అంతర్గాం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పెద్దంపేట్ రాయదండి గ్రామ కూర్సు కమ్మి భూములకు పట్టాలి పించే అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు చందర్ దేనని ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంతో పాటు బిపిఎల్ కు సంబంధించిన భూముల పట్టాల విషయం శాసనసభలో మాట్లాడితేనే మీరు ఇచ్చిన హామీకి ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుందని అలా కాకుండా సోషల్ మీడియాలో కల్లబొల్లి మాటలతో పొంతనలేని ప్రకటనలతో రైతులను గందరగోళం చేయవద్దని ఈ శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తకపోతే ఈ విషయంలో మీరు మాట తప్పినట్టే అవుతుందని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ గారి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా శక్తి వంచన లేని పోరాటం చేస్తామని తెలియజేశారు ఇప్పటికైనా కల్లబొల్లి మాటలతో కాకుండా రైతులకు పట్టాలు ఇప్పించే అంశం పై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు*అనంతరం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతుల నోట్లో మట్టి కొడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులో ప్రజలే బుద్ధి చెప్తారని వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో దృష్టి సారించాలని స్థానిక శాసనసభ్యడిని డిమాండ్ చేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిమెట్ల రాజలింగంలతో పాటు అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్ రెండు మండలాల కోఆర్డినేటర్ గాదె సుధాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాల రాజేందర్ పల్లె రవీందర్ బైరి కిరణ్ బండారి చంద్రయ్య గాదె తిరుపతి యూత్ కాంగ్రెస్ నాయకులు దుశేటి శ్యామ్ లగిశెట్టి కిషన్లు పాల్గొన్నారు..

Post A Comment: