ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు.
మాసైనా, క్లాస్ అయినా, క్లాసికల్ అయినా, జాజ్ అయినా ఆమె తన గొంతుతో పాటలకు ప్రాణం పోసి శ్రోతలను అలరించిన గొప్ప గాయని అన్నారు.
14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలు విశేషమైనవి అన్నారు.
ఆమె మృతి చిత్ర పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని అభివర్ణించారు.
వాణీ జయరాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.

Post A Comment: