ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జిల్లాలో విజయవంతం అయ్యిందని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి శనివారం తెలిపారు. జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్-9 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందనీ, ఇందులో భాగంగా 37 మంది బాలకార్మికులను గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చి, బాల కార్మికులుగా పెట్టుకున్న సంబదిత యజమానులపై కేసులు , నమోదుచేయడం జరిగిందని ఎస్పి పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్సై , ముగ్గురు కానిస్టేబుల్స్, ప్రత్యేకంగా కేటాయించామని, అలాగే జిల్లాలోని వివిధ శాఖలు సహాకారం అందిచాయని ఎస్పి పేర్కొన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఎస్పి కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, మరియు ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుందనీ, అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, తప్పిపోయిన, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వవాలని ఎస్పి కోరారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పి హెచ్చరించారు.
ఈ సందర్బంగా ఆపరేషన్ స్మైల్ -9 విజయవంతం కావడానికి సహకరించిన రెవెన్యూ, జిల్లా బాలల పరిరక్షక విభాగం, విద్యాశాఖ, , కార్మిక శాఖ, పోలీసు అధికారులను, సిబ్బందిని, చైల్డ్ లైన్ - 1098 ను ఎస్పీ అభినందించారు.

Post A Comment: