మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజక వర్గం లోని మల్కాపూర్ లో గత 45 రోజులుగా గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మగ్గం మరియు టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వారికి గౌతమీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షురాలు సోమారపు లావణ్య చేతిలో మీదుగా సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ట్రస్టు నిర్వాహకురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ అభినందనలు తెలుపుతూ మనం ఇన్ని రోజులుగా నేర్చుకున్న శిక్షణను పడ్డ శ్రమను పదిమందికి అవసరమయ్యే విధంగా మనం నేర్చుకున్న మగ్గం వర్క్ మరియు కుట్టు మిషన్ శిక్షణ అనుభవాన్ని మన చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు వారికి అవసరమయ్యే విధంగా సేవలు అందించి మనం ఆర్థికంగా ఎదగాలని పలువురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాతంగి రేణుక,గాండ్ల స్వరూప, సాయి లత,సంధ్య,సాహితి,మాధవి పాల్గొన్నారు.

Post A Comment: