మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా *ప్రజా గోస- బిజెపి భరోసా కార్యక్రమం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గం మల్కాపూర్ మండల పరిధిలోని కృష్ణానగర్(4th,Division),లో శక్తి కేంద్రం అధ్యక్షుడు కూర మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ 58,59 60, బూతులకు సంబంధించిన శక్తి కేంద్ర సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వారికి కమీషన్లు వచ్చే పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఇప్పటికే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ వైఖరి పట్ల విసిగిపోయి ఉన్నారని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా కమలం గుర్తుపై ఓటు వేసి కాషాయ జెండా ఎగురవేసే దిశగా పట్టుదలతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ ,కార్పొరేషన్ అధ్యక్షులు గుండ బోయిన లక్ష్మణ్,
బిజెపి సీనియర్ నాయకులు జూపూడి అమరేశ్వర్ రావు,
మల్కాపూర్ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్,
కొండ బానయ్య, కూనారపు పొశం,బద్రిదేవేందర్,భరత్,గాండ్ల స్వరూప మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: