మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అనారోగ్యం, అంగవైకల్యంతో బాధపడుతున్న మహేష్‌కు ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో సాయం అందేలా కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు.
మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన తోకల మహేష్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా మంజూరైన బ్యాటరీ సైకిల్‌ను అందజేసిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూమహేష్ ఎన్నో రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇటీవల పెరాలసిస్ రావడంతో నడవలేని స్థితిలో ఉండగా దుబ్బపల్లి గ్రామానికి ఇటీవల వచ్చిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలిసి తన పరిస్థితి వివరించి, తనకు పునరావాసం కల్పించాలని, బ్యాటరీ సైకిల్ ఇప్పించాలని వేడుకున్నాడని తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి గారు తక్షణమే బ్యాటరీ సైకిల్‌ను ఇప్పించాడని, అలాగే ప్రభుత్వపరంగా ఇంటి స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అయితే మహేష్‌కు వెంటనే ఇంటి స్థలం చూపించే విధంగా జిల్లా కలెక్టర్, స్థానిక తహశీల్దార్‌తో మాట్లాడుతామని, అలాగే ప్రభుత్వపరంగా ఇంటి నిర్మాణం కోసం అందించే రూ.3లక్షలు అందించే పథకంలో స్థానిక సర్పంచ్ సహకారంతో ఇంటి నిర్మాణం చేయించేలా పూర్తిస్థాయిలోసహకారం అందిస్తామన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న మహేష్‌కు అన్ని విదాలుగా తనవంతు సహకారం అందిస్తానని, మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. మహేష్ విన్నపం మేరకు తక్షణమే బ్యాటరీ సైకిల్ ఇప్పించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు కృతజ్ఞతలు తెలిపారు...

Post A Comment: