మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

"ది బెస్ట్ సిటిజన్ అవార్డు " అందుకున్న సందర్భంగా తోట శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సొసైటీ ఫర్  రూరల్ , అర్బన్ డెవలప్మెంట్ ఇండియా జాతీయస్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణ , విద్యుత్ ప్రమాదాల నివారణ క్యాటగిరి కింద జాతీయస్థాయిలో " ది బెస్ట్ సిటిజన్" 2022-2023 సంవత్సరానికి గాను ( ఉత్తమ పౌరుడు )అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని , తెలంగాణ రాష్ట్రం , రామగుండం కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో కలిపి ఇప్పటివరకు దాదాపుగా 150 పైగా వాహనాదారులకు ప్రమాదకరమైనటువంటి గుంతలను పూడ్చానని , 50 కి పైగా క్రుంగిపోయినా మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేపించానని , 20 కి పైగా సేఫ్టీ బాక్స్ లేని స్తంభాలకు విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా సేఫ్టీ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రోడ్డు మరమ్మత్తులు , డ్రైనేజీ కుండీలు మరమ్మతులు చేస్తున్న సమయంలో చాలామంది నువ్వు చదువుకున్న చదివేంటి ? నువ్వు చేస్తున్న పని ఏంటి అని నిరుత్సాహపరిచారని కానీ నా తండ్రి గారు స్వర్గీయ మోహన్ రావు  నన్ను ప్రోత్సహించారని , ప్రజల ప్రమాద నివారణలో భాగంగా నువ్వు చేస్తున్న ఈ మంచి పనులకు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు , నువ్వు పది మందికి మంచి చేస్తే ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడని నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించారని. నాలో స్ఫూర్తి నింపి ఈ అవార్డుకు పరోక్షంగా కారణమైనటువంటి మా తండ్రి స్వర్గీయ మోహన్ రావు కు ది బెస్ట్ సిటిజన్ " అవార్డు ను అంకితం చేస్తున్నాను.

ఈ అవార్డుతో పాటు ప్రోత్సాహంగా అవార్డు కమిటీ వారు ఇచ్చినటువంటి 5000 రూపాయల నగదును రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ అంగన్వాడి కేంద్రాలలో చిన్నపిల్లలు ఉత్సాహంగా చదువుకోవడానికి ఆట వస్తువులు, చిన్నపిల్లలు కూర్చోవడానికి చిన్న కుర్చీలు ఏర్పాటు చేస్తానని తెలిపారు... 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: