మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కుటుంబ పెద్ద చనిపోవడంతో అత్యంత దీనస్థితిలో ఉన్న అతని కుటుంబసభ్యలకు, మేమున్నా మంటూ శ్రీరామ విద్యనికేతన్ సిబ్బంది చేయూత నిచ్చారు. స్థానిక అడ్డగుంటపల్లి ఏరియాలో కిరాయి ఇంటిలో నివసించే ఐత సంతోష్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అతని పైనే ఆధారపడి జీవించే వారి కుటుంబం రోడ్డున పడి దిక్కు లేని స్థితిలో ఉండగా, ఇందిరా లాడ్జి ఓనర్ వీరికి షెల్టర్ ఇచ్చి ఆదుకుంటున్నారు. తిండికి, బట్టకి దూరమై అత్యంత దీనవస్థలో ఉన్న ఈ కుటుంబానికి చేయూత నివ్వాలని గుండారపు శ్రీను పద్మావతిల చొరవతో శ్రీరామ విద్యనికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, 50 కిలోల బియ్యం సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జ్యోతి మాట్లాడుతూ, అద్దె ఇంటిలోనే చనిపోయినాడని, ప్రస్తుతం వీళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని, వీరి పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నదని, సంతోష్ వాళ్ళ నాన్న చాలా ముసలివాడని, పాపం వీళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి మా స్కూల్ తరఫున టీచర్స్ అందరు కలిసి తక్షణమే ఐదు వేల ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యం వేయడం జరిగిందని, అలాగే అందరూ దయచేసి తగినటువంటి సహాయం చేయగలరని, వివరాలకు 8464054893 నెంబర్ కి సంప్రదించి తక్షణ సహాయం అందించాలని, అతని కర్మలకు, బ్రాహ్మణులకి వాటికి ఖర్చులు కూడా, ఇంకా చాలా అవసరాలు ఉంటాయని, కాబట్టి దాతలు సహకరించాలని, ఇంకో రెండు రోజుల్లో వారికి ఇంకా కలెక్ట్ చేసి కూడా ఇస్తా మని చెప్పినారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ విద్యనికేతన్ టీచర్లు శైలజ, రాణీ, పద్మావతి,లక్ష్మీ ,సిబ్బంది, జర్నలిస్ట్ లు గుండారపు శ్రీను, పర్కాల లక్ష్మినారాయణ, కండే రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: