మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కే రాజన్నసదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా *సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రకారం "ఐదవ షెడ్యూల్" ఆదివాసులకు ఇచ్చిన అనేకమైన హక్కులు ఈ అడివి సంరక్షణ నియమాలు హరించి వేస్తుంది, గతంలో ఆదివాసి ఉద్యమాల ఫలితంగా 1-70, గ్రామసభలు, పీసా యాక్ట్ లాంటివి అనేకమైనవి వారి హక్కులకు రక్షణగా నిలబడ్డాయి, ఈనాడు గ్రామసభని రద్దు చేయడం ద్వారా అడివిలో భూమిని ఇతర ఖనిజ సంపదను గ్రామ సభకు సంబంధం లేకుండానే కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు కమిటీ ద్వారా నిర్ణయించటం ఆదివాసుల సంపదకి భంగకరమైనది. దేశవ్యాప్తంగా 40 కోట్ల ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా అడవి మీద జీవిస్తూ దేశ సంపదను పెంపొందిస్తున్నారు, కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ పేరుతో ఆదివాసులు అందర్ని కూడా అడవి నుండి గెంటివేసే కార్యక్రమానికి పూనుకున్నది. అడవిని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.ఈ దుర్మార్గమైన చర్యను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున తక్షణమే "2022 అడవి సంరక్షణ నియమాలను" ఉపసవరించుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గుమ్మడి వెంకన్న, జూపాక శ్రీనివాస్ లు పార్టీ నుండి వెళ్ళి పోయినందున ఇక నుండి న్యూడెమోక్రసీ పార్టీ తో ఏలాంటి సంబందం లేదని తెలియచేస్తున్నము. 13 మంది తో నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది, ఈ నూతన CPI(M-L) న్యూడెమోక్రసీ మండల కమిటీ కార్యదర్శిగా కొల్లూరి మల్లేష్, సహాయ కార్యదర్శిగా మేరుగు చంద్రయ్య లు కొనసాగుతారు.
ఇంకా ఈ కార్యక్రమంలో *సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి మల్లేశ్ అద్యక్షత వహించగా పార్టీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, డివిజన్ నాయకులు సీ హెచ్ అబేద్నేగో, మేరుగు చంద్రయ్య, కె మొగిలి, స్థానిక నాయకులు బి ఆనంద్, వేల్పుల సాంబయ్య, ఉప్పులేటి నర్సయ్య, సమ్మెట తిరుపతి, పైడిపెల్లి రమేష్, ఆరుమూళ్ళ తిరుపతి, మాలం తిరుపతి, డి సతీష్ , మాడ మల్లేశం, తీగుట్ల నవీన్, బి మహెందర్,బి సాగర్ , టి రాజకొమరయ్య, కె లింగమూర్తి, వి సదానందం,బి రమేశ్, నక్క మల్లేశం, కుమర స్వామి, పూర్ణచందర్, శ్రీనివాస్,ఇ బాబు, గోనె రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: