మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

జోరుగా సాగుతున్న మక్కాన్ సింగ్ పాదయాత్ర*భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ  చేపట్టిన  భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రామగుండం నియోజకవర్గంలోని 43వ*డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కార్పోరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్  ఆధ్వర్యంలో జరిగిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర(For Change) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ, ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలుకరిస్తూ యాత్ర  కొనసాగింది*ఈ సందర్భంగా  మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ నుండి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర(For Change) కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నదని,  డివిజన్లోని ప్రతీ ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను మరియు రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి ప్రజలకు తెలియచేసి, బీజేపీ, బి.ఆర్.ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక మరియు కార్పొరేట్ అనుకూల విధానాలపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే చార్జిషీట్ ను  ప్రజలందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇక్కడి రామగుండం శాసనసభ్యుడు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను మరచి, ఒక నియంత పాలన కొనసాగిస్తునన్నాడని, ప్రభుత్వపరంగా వచ్చే సంక్షేమ పథకాలను కేవలం వారి అనుచరులకే, అక్రమంగా కేటాయించుతూ రాబోయే ఎన్నికల కోసం ఆర్ధిక వనరులను వెనకేసుకుంటున్నాడని దుయ్యబట్టారు.

అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకుని, వాటి పరిష్కారం కొరకై చేపట్టిన ఈ పాదయాత్ర దాదాపుగా 15 రోజుల్లోనే ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి రామగుండం శాసనసభ్యుడు ఓర్వలేక, తన అనుచరులతో పిచ్చికూతలు, పిచ్చిరాతలతో కూడిన కరపత్రాలను పంచుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు సరైన సమయంలోనే బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు..

అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ పట్టం కడితే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు,

ఆరోగ్యశ్రీ క్రింద ఖర్చులకు 

రూ.5లక్షలతో పాటు వరంగల్ డిక్లరేషన్ ను పూర్తి స్థాయిలో అమలు పరచి బంగారు తెలంగాణాకు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, 50డివిజన్ల కోఆర్డినేటర్ మాదరబోయిన రవికుమార్, యాత్ర ఛైర్మెన్ ఎండీ ముస్తఫా,కార్పొరేటర్ మహంకాళీ స్వామి, గాధం విజయానంధ్, మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్, పాతిపెల్లి రవి, బొమ్మక రాజేష్, ఎస్సీ సెల్ అద్యక్షులు తాల్లపెల్లి యుగేందర్, మైనారిటీ అధ్యక్షులు నజీమొద్ధీన్, బిసి సెల్ నాయకులు పెండ్యాల మహేష్, గట్ల శారద, సొల్లు రామస్వామి, చందు, యాకూబ్, ఆడేపు దశరధం, అడప సాయికిరణ్, బొంతల లచ్చన్న, గడ్డం శేఖర్, బూర్ల శ్రీనివాస్,వివిధ డివిజన్ల అధ్యక్షులు యాద వెంకటరమణ,తిరుపతి రెడ్డి, సొన్నాయిల లింగయ్య, కీర్తి నాగరాజు,నంది వెంకటేష్, పీక అరుణ్, యువజన నాయకులు ఎండీ రహీం, నాజీం, సిరిశెట్టి సతీష్, అడప కృష్ణ, గుదికందుల రవి,  సిరిపురం మహేష్, రాపెళ్ళి కార్తీక్, ఈడునూరి హరిప్రసాద్,. సింగం కిరణ్ కుమార్ గౌడ్, అప్పసి శ్రీనివాస్, గజ్జెల నాగరాజు, కంపెల్లి సంతోష్, కుడిదేల శివ, మాదరవేన కిరణ్, ఆశ్రఫ్, అల్లి శంకర్, సమ్మెట స్వప్న, సల్మా, లావణ్య, సంధ్య, పెరుక జ్యోతి, రాసమళ్ళ కిరణ్ లతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: