మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కబ్జా కబ్జా కబ్జా అసలు రామగుండం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది , కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు పేట్రేగిపోతున్నారు. నియోజకవర్గ పెద్దమనిషి అండ ఉంది , అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ధీమతో ఆఖరికి బరితెగించి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ కొత్త కూరల మార్కెట్ లోని వెళ్లే ప్రధాన దారిలో గోడ కట్టి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . గతంలో ఇదే మాదిరిగా స్లాటర్ హౌస్ ( జంతువుల వదశాల ) నువ్వు కబ్జా చేయడానికి ఒక అధికార పార్టీ నాయకుడు ప్రయత్నిస్తే అప్పటి కలెక్టర్ యుద్ధ ప్రతిపాదన స్పందించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన నాయకున్ని అరెస్ట్ చేపించి అట్టి ప్రయత్నాన్ని ( కబ్జా ) నిరోధింపజేసింది.
రామగుండం పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సెక్షన్లో లో మార్కెట్ కు సంబంధించిన మ్యాప్ ఉంది.
మ్యాప్ లో పార్కింగ్ మరియు 12 ఫీట్ల దారి ఉంది .
కార్పొరేషన్ వారి యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఇట్టి దారిని కబ్జా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతున్నాను. ఇలానే మనం మౌనంగా ఉంటే ఎవడో వచ్చి చౌరస్తాను కూడా గతంలో మా తాత ఇక్కడ చాయ్ బండి పెట్టిండు ఇది నాదే అని అంటాడు.

Post A Comment: