ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు టీచర్లు గాయపడారు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ గోపాలపురo డబ్బాల ప్రాంతానికి చెందిన చాప బాబు దొర, మానుపటి రమేష్ బాబు
చాప లక్ష్మి, నాలి జయమ్మ, బిజీలి విజయ ములుగు జిల్లా పస్రా మండలంలో టీచర్లుగా పని చేస్తున్నారు.
వీరంతా బుధవారం ఉదయం కారులో విధులకు వెళుతుండగా ముచ్చర్ల ఔటర్ రింగ్ రోడ్డు పై బొలెరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదం లో అయిదుగురు టీచర్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post A Comment: