మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఈరోజుల్లో  నిత్యం జరిగే పరిణామాలను సంఘటనలను జీవన విధానాలను పోల్చుడును నాగరిక సమాజంలో ప్రధాన సాంప్రదాయంగా మారింది అ నాడు ఎలా ఉన్నాయి రోజులు  నేడు ఎలా మారాయి రోజులు  అని పోల్చి చెప్పుకోవడం పరిపాటిగా మారింది నాటి కాలంలో  చాయ గ్లాస్ కు  రెండు రూపాయలు ఉండేది  ఇప్పుడు ఐదు రూపాయలు  దాటి పది రూపాయలకు చేరుకునే  గ్లాసు సైజు కూడా సగానికి తగ్గిపోయింది ఇట్లా అనేక విషయాలు వివరిస్తే రోజుల తరబడి చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో   అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పటి ఎమ్మెల్యేలతో  పోల్చి సంఘటనలు  వివరిస్తున్నారు. ఆ రోజుల్లో అభ్యర్థుల ప్రచారానికి అనేకమంది యువకులు రైతులు తమ పనులను వదిలిపెట్టి అంకిత భావంతో తరలి వచ్చేవారు అభ్యర్థి నుంచి నయా పైసా ఆశించకుండా తమకు నచ్చిన అభ్యర్థి విజయానికి కృషి చేసేవారు ఇతర గ్రామాలకు వెళ్తే అక్కడి ముఖ్య నాయకులు అభ్యర్థి స్నేహితుని ఇంట్లోనే భోజనాలు చేసేవారు అభ్యర్థులు అత్యంత తక్కువ ఖర్చుతో తమ ఎన్నికల వ్యవహారాన్ని ముగించేవారు అప్పటి ప్రచారంలో గోడల మీద రాతలే అభ్యర్థి విజయానికి చాటి చెప్పేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియాను ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటున్నారు. ఇంకా పోతే ప్రస్తుత కాలంలో ఎన్నికల వ్యవహారాలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్నది. పైసలు అనే పదం మాయమైంది వాటి స్థానంలో రూపాయలు ప్రవేశించాయి, 500 నోటు నుండి 2000 నోటు వరకు  ప్రస్తుతం ముఖ్యపాత్ర పోషిస్తుంది ప్రచారానికి అభ్యర్థి ఇంటి మనుషులు కూడా రావడం లేదు ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప అభ్యర్థులు బంధువులు స్నేహితులు రంగ ప్రవేశం చేయడం లేదు ఏమీ ఆశించకుండా ప్రజలు ఎవరు ముగ్గు చూపడం లేదు, ఒక ర్యాలీ నిర్వహించాలంటే మనిషికి 500 నగదు చెల్లించి మంచినీటి ప్యాకెట్లు అన్నం ప్యాకెట్లు ఇవ్వాల్సి వస్తుంది ఒక అభ్యర్థి రెండు మూడు గంటల పాటు ర్యాలీ నిర్వహించాలంటే ఒక్కో కాలనీలో కనీసం రెండు లక్షల ఖర్చు చేయాల్సి వస్తుంది గోడ రాతలు మాయమయ్యాయి కరపత్రాలు వాల్ పోస్టర్లు కండువాలు ముద్రించడానికి వేల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది, సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో  న్యూస్ పేపర్లో టీవీలో ప్రచారానికి వాటికి స్థాయి బట్టి బేరమాడుతున్నారు  వేల నుంచి లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రచారాల్లో పాల్గొన్న ముఖ్య నేతలకు మందు విందు ప్రతిరోజు తప్పనిసరిగా మారింది, ఈ ప్రచార వ్యవహారాల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది మోటార్ సైకిల్ కార్లు ఇతర వాహనాలు వాటి కిరాయిలు పెట్రోల్ డీజిల్ ఖర్చులు అవన్నీ రాసుకుంటూ పోతే లక్షల మాట వట్టిదే అనుకోవచ్చు  కోట్ల వ్యవహారంగా మారింది ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వ్యక్తులకు కనిపించడం లేదు ఒకవేళ పోటీలో దిగిన ఈ పోటీ వ్యవహారాల్లో లక్షలు దాటి కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచి మిగిలిన 5 ఏళ్ల కాలంలో ఏదో ఒక రూపంలో మళ్ళీ డబ్బులు సంపాదించడం మినహా మరో మార్గం లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజకీయాలు ప్రజాసేవ కోసం కాదు కానీ రాజకీయం పేరట వ్యాపారాలు చేయడమేనని స్పష్టమవుతుంది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: