ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు హనుమకొండ జిల్లాలోని కరుణాపురంలోని కొలంబొ లేప్రసి కాలనీ, ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు లష్కర్ సింగారం అర్బన్ హెల్త్ సెంటర్లో మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రం ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుటకు రాష్ట్ర బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసి అధిక నిధులను కేటయిoచడం ఆయన దూర దృష్టికి నిదర్శనమని, అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మరియు కంటి వెలుగు కార్యక్రమాన్ని మరికొసారి ఏర్పాటుచేసి 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేయిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం కూడా ముఖ్యమంత్రి ఆలోచన విధానం ద్వారానే ఏర్పడిందని, అలాగే వరంగల్, హనుమకొండ నగరమును హెల్త్ సిటీగా ఏర్పాటు చేయుటకు 2100 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం శర వేగంగా జరుగుతుందని, తెలుపుతూ రాష్ట్ర రాజధాని లోని నలు దిక్కులలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం ముఖ్య మంత్రి గారి వైద్య రంగం పై ఉన్న నిబద్ధతకు తార్కాణమని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రజారోగ్యం విభాగము కింది స్థాయి నుండి డాక్టర్ల వరకు కోవిడ్ నియంత్రణలో ఎనలేని కృషిచేసి ప్రజల మన్ననలను పొందారని ఆయన తెలుపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా రాష్ట్రానికి సేవలందించాలని ఆయన పేర్కొన్నారు. ధర్మసాగర్ పిహెచ్‌సి లో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్‌పిటిసి పిట్టల శ్రీలత తో కలసి కంటి అద్దాలను అంద చేయడం జరిగింది. ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినo సంధర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆరోగ్య ఉప కేంద్రాలలో మొక్కలు నాటడం, రోగులకు పండ్లు పంచి వైద్య ఆరోగ్య సిబ్బంది సామాజిక కార్యక్రమంలో ముందు ఉండడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, ధర్మసాగర్ జెడ్‌పిటిసి శ్రీమతి పిట్టల శ్రీలత, వరంగల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. వెంకటరమణ, జెడ్‌పి కొ ఆప్షన్ మెంబర్ శ్రీమతి జూబెద, అడిషనల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ మదన్మోహన్ రావు, పి ఓ డి టి టి డాక్టర్. లలిత దేవి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యాకూబ్ పాషా, కరుణపురం సర్పంచ్ అనిల్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ ఉమా శ్రీ, వరంగల్ కంటి వెలుగు అధికారి డాక్టర్ గోపాలరావు, ధర్మసాగర్ వైద్యాధికారి డాక్టర్ గోపినాథ్, లష్కర్ సింగారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ తేజస్విని, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో ప్రసాద్,సిహెచ్‌ఓ లు నెహ్రూ చందు, మాధవ రెడ్డి, డిపిఎంఓ కొమురయ్య, రవీందర్, ఆఫ్తాల్మిక అధికారులు రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రసాద్, రామచందర్, సహజ, వేణుగోపాల్, సూపర్వైజర్ బాబు,శ్రీనివాస్, లష్కర్ సింగారం అర్బన్ సెంటర్ సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: