మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: బీజేపీ రాష్ట్ర నాయకులు,మంథని నియోజక వర్గ ముఖ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి చేపట్టిన మంథని ప్రజా చైతన్య యాత్ర, ప్రజా గోస బీజేపీ భరోసా,గడప గడపకి సునీల్ రెడ్డి యాత్రను మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి,బిజెపి శ్రేణులతో కలిసి, విజయాలను అందించే మంథని నియోజక వర్గ ప్రజల ఇలవేల్పు తల్లిగా భావించే ఉట్లపల్లి పోచమ్మ తల్లి దగ్గర ఆదివారం రోజున సాంప్రదాయ పరంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు.అన్నారం వీధులలో పాదయాత్ర చేసి,జెండా ఆవిష్కరించి,తదుపరి ప్రజా చైతన్య పాదయాత్రను ఉద్దేశించి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగట్టి,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా మంథని నియోజకవర్గం లోని అన్ని మండల,గ్రామాల,పల్లెల ప్రజలందరికి తెలియపరిచేందుకు మంథని నియోజక వర్గం ముఖ్య నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టడంపై వివేక్ వెంకటస్వామి అతనిని అభినందించారు.ప్రజలల్లో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలపై రైతులు,ప్రజలు,విద్యార్థులు, ఉద్యోగులు,అన్ని వర్గాల వారు విశ్వాసంతో ఆకర్షితులయ్యారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రజల ఓటు తీర్పుతో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమేనని,మంథని గడ్డపై ఎగిరేది కాషాయ జెండా,గెలిచేది సునీల్ రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు యుగదీశ్వర్,యాత్ర ముఖ్యులు వెన్నంపల్లి పాపయ్య,పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రాంనాథ్, జిల్లా నియోజకవర్గ ప్రబారి అనిల్ రెడ్డి,యాత్ర సహ ప్రముక్ దుర్గం తిరుపతి, మహాదేవపూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ,ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్,సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, ఆకుల శ్రీధర్,వివిధ జిల్లాల, నియోజకవర్గాల,మండలాల, గ్రామాల,నాయకులు,ప్రజలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Post A Comment: