మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు దెబ్బట కమలాకర్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ గురు రవిదాస్ 646 వ జయంతిని స్థానిక శివాజీ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ,భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సంత్ గురుదాస్ నిరక్షరాసుడైనప్పటికీ మోచి వృత్తిని కాశీ నగరంలో చేస్తూ సాధువులు సంతులు వారు చేస్తున్నటువంటి వేదాలను కేవలము అనుసరించి మాత్రమే ఏ విధమైనటువంటి అక్షర భాష లేనప్పటికీ అనర్గళంగా వేదాలను నేర్చుకొని భాషా పాండిత్యాన్ని నేర్చుకొని సంగీతాన్ని అనర్గలంగా నేర్చుకొన్న అపార మేధావి అన్నారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నేతృతంలో అఖండ భారతను సాధించడం ఖాయమని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్, దళిత మోర్ఛ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి బీమా సుధీర్, దళిత మోర్చా కార్పొరేషన్ ఉపాధ్యక్షులు కాపరపు రాజలింగు, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు సితకారి చంద్రశేఖర్, కార్పొరేషన్ కోశాధికారి తూముల వెంకటేశ్వరరావు, రాచకొండ కోటేశ్వర్లు, సురేందర్, మంచిగట్ల బిక్షపతి, సాగి కిషన్ రావు, మల్కాపూర్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్, మండల అధ్యక్షులు డేవిడ్ రాజు, చల్ల శ్రీనివాస్, ఇందారం సతీష్, కాంపల్లి రవి ,అడ్వకేట్ సురేష్ ,అజీముద్దీన్ అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: