ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
వరంగల్ - హనుమకొండ లోని ఎన్జీవో కాలనీ రెడ్డి మ్యారేజ్ పంక్షన్ హాల్ లో మంగళవారం నుండి 14 రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
14 ఫిబ్రవరి నుండి 27 ఫిబ్రవరి వరకు హనుమకొండలో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు చేపట్టడం అభినందనీయం.
ఈ చేనేత వస్త్ర ప్రదర్శన లో 70 స్టాల్స్ ఉన్నాయి.
సీఎం కెసిఆర్ నాయకత్వంలోని
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే జిల్లా ప్రజలకు అందించటమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యము.
చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం, చేనేత కార్మికులకు నిరంతర పని మరియు జీవనోపాది కల్పించడం, చేనేత కార్మికులు కాలానుగునంగా తమ ఉత్పత్తులను ఆధునిక డిజైన్లకు అనుగుణంగా తయారు చేయడానికి చేనేత విశిష్టత గొప్పతనం ప్రజలందరికి తెలియజేయడం ఈ వస్త్ర ప్రదర్శన లక్ష్యం.
ఎలాంటి రుసుము చెల్లించకుండా వస్ర్త ప్రదర్శనలో అమ్మకాలు జరుపుకొనునటకు అవకాశము కల్పించాం.
ఉచిత విద్యుత్, వస్త్ర ఉత్పత్తులకు ఉచిత భీమా, చేనేత కార్మికులకు ఉచిత వసతి కల్పిస్తున్నాం.
ఈ ప్రదర్శనలో
1.ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి,
2. గద్వాల్
3.వేంకటగిరి,
4.ఉప్పాడ ,
5.మంగళగిరి,
6.చీరాల చీరలు
7. డ్రెస్ మెటీరియల్స్,
8.కరీంనగర్ బెడ్ షీట్స్,
9.లుంగీలు,
10.టవల్స్,
11.షత్రంజి లు కార్పెట్లు మరియు అన్ని రకాల నాణ్యమైన చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ చేనేత వస్ర్త ప్రదర్శనలో తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , వెస్ట్ బెంగాల్, జమ్మూ & కాశ్మీర్, మధ్యప్రదేశ్ మొదలయిన రాష్ట్రముల నుండి 60 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు పాల్గొంటున్నాయి.
అయితే, వరంగల్ జిల్లా నందు 28 చేనేత సహకార సంఘాలలో 1323 జియో ట్యాగింగ్ చేయబడిన మగ్గములు ఉండగా 2023 మంది చేనేత కార్మికులు పని చేయుచున్నారు.
ఆయా సంఘాలకు ప్రభుత్వం యార్న్ డిపో నుండి కొనుగోలు చేసిన చిలపనూలు, రంగులు మరియు రసాయనాలపై 40 శాతము ఇన్ ఫుట్ సబ్సిడీగా అందిస్తున్నది.సహకార మరియు సహకారేతర రంగములలోని చేనేత కార్మికులకు అందజేయడము జరుగుతుంది.
ఈ పథకములో భాగ0గా 1,800 మంది చేనేత కార్మికులకు 1 కోటి 92 లక్షల 43 వేల 594 నేరుగా వారి ఖతాలలోకి జమ చేయడము జరిగింది. అలాగే, నేతన్నకు చేయూత, నేతన్న భీమా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కాగా, చేనేత కార్మికుల ఉత్పత్తుల పై కేంద్రం 5 శాతం జి.యస్.టి(GST) విధిస్తున్నది.
దీని వలన వారి అమ్మకాలు, కొనుగోళ్ళు పై 5 శాతం నష్ట పోతున్నారు. ఇంకా దీనిని 12 శాతం పెంచడానికి కేంద్రం ఆలోచిస్తున్నది.
గతంలో ఎ ప్రభుత్వం విధించని విధంగా చేయటం వలన కే.టి.ఆర్ అనేకసార్లు జి.యస్.టి ని తీసివేయాలని కేంద్రంను కోరటం జరిగినది.
మన చేనేత కార్మికులు 1 లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. అయిన చలనం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు 2016/- రూపాయలు నెల నెల పెన్షన్ అందిస్తున్నది.
రాష్ట్రంలో మొత్తం 37 వేల 116 చేనేత కార్మికులకి నెలకు 7 కోట్ల 48 లక్షల రూపాయలు సంవత్సరానికి 89 కోట్ల 96 లక్షలు అందిస్తున్నాము.
వరంగల్ జిల్లాలో 2 వేల 345 చేనేత కార్మికులకి నెలకు 47 లక్షల 31 వేల రూపాయలు, సంవత్సరానికి 5 కోట్ల 67 లక్షలు రూపాయలు అందిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: