రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఫోటు రంగారావు  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తున్నామనే పేరుమీద కుట్రలకు పడుతున్నది. గిరిజనులకు బిక్ష వేస్తున్నామని ఆదివాసీలను అవమానానికి గురిచేస్తుంది. అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాసం ఉన్నది. అటవీపై పూర్తి హక్కులు ఉన్న ఆదివాసీలను అవమానపరిచే విధంగా ప్రజా ప్రతినిధుల సంతకాలు ఉండాలని కుట్రలు చేయడం సరి కాదు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గాని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గాని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు. కేవలం కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం మాదిరిగా రెండు ప్రభుత్వాలు బడ్జెట్ను ప్రవేశపెట్టాయి. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ గా విమర్శిస్తున్నాం. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి తగ్గట్టుగా ఈ బడ్జెట్ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 28% నిరుద్యోగాన్ని ఏ విధంగా నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు.

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. కేవలం 45 శాతం పేరు పెట్టి అది కూడా కొద్దిమందికే చెల్లించి చేతులు దులుపుకుంటే ఊరుకోబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించే వరకు సిపిఎంఎల్ ప్రజా పందా బాధితులకు అండగా ఉండి పోరాడుతామని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న గోదావరిఖనిలో ప్రజా సమస్యల కోసం, కార్మిక వర్గ దృక్పథంతో పోరాడుతామని అట్టి పోరాటాలకు ప్రజలంతా అండగా నిలిచి ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఇంకా ఈ విలేకరుల సమావేశంలో IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, రాష్ట్ర నాయకులు జి రామయ్య, సిపిఐ ఎమ్ ఎల్ ప్రజాపందా రాష్ట్ర నాయకులు నంది రామయ్య, జిల్లా నాయకులు జి సత్యనారాయణ రెడ్డి, జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, బి కృష్ణ, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, పెండ్యాల రమేష్ లక్ష్మీ, బి ప్రసన్న, ఇనుగాల రాజేశ్వర్, మార్త రామన్న, మార్త రాద, ఎల్లయ్య, మైసయ్య, తీగుట్ల రాములు బర్పటి మల్లయ్య, తీగుట్ల కనకయ్య, తీగుట్ల శ్రీనివాస్, టి దేవేందర్, కత్తెరమల్ల నర్సింగ్ లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: