ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

స్వామి - అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు. ఈ కార్యక్రమంలో మంత్రి  కుటుంబ సభ్యులు, మనవలు, మనవ రాళ్ళు తదితరులు పాల్గొన్నారు.

అలాగే వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య దంపతులు, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి దంపతులు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్  సతీమణి, కుటుంబ సభ్యులు, జనగామ డీసీపీ సీతారా0 దంపతులు. కల్యాణం లో కూర్చున్న పలువురు ప్రముఖులు, పాలకుర్తి ప్రాంత చుట్టుముట్టు ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అశేష భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 

శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే రోజు శివరాత్రి.

శివరాత్రి రోజు శివుడు  పార్వతి ల పెళ్లి జరిగిన రోజు

లింగోద్భవం జరిగిన రోజుగా శివ పురాణం చెబుతున్నది.

శివ - శక్తి కలయిక రోజుగా కూడా మహా శివరాత్రి ని పేర్కొంటారు.

శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. 

సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

మహాశివరాత్రి రోజున

ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. 

ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం.

పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. 

తపస్సు, యోగ, ధ్యానం వాటి అభ్యాసం ముక్తి పొందడానికి దారులుగా చెప్పవచ్చు.

దేశ విదేశాల్లోని శివ భక్తులు కూడా పండుగను అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.

శివరాత్రి, రాజయోగ విశిష్టతను తెలిపే విధంగా ఇక్కడ ప్రతి ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు జరపడం సంతోషదాయకం

అద్భుతమైన శివలింగ దర్శనం తో పాటు, శివ, జీవ తత్వాన్ని ప్రజలకు, ప్రత్యేకించి శివ భక్తులకు అందించడం హర్ష దాయకం.

ఆత్మశుద్ధి యే అభిషేకం

అన్నపానాదులు మాని, శివనామ స్మరణ చేయడమే ఉపవాసం

కామ క్రోధ మధ మాత్సర్యములను శివార్పణం చేయడమే జాగరణ

మనస్సును శివైక్యం చేయడమే రాజయోగం

భక్తి ని ప్రచారం చేస్తూ, ముక్తి ని ప్రసాదిస్తున్న ఇక్కడి పూజారులు, ఆలయ అధికారుల ప్రయత్నాలను, పరిశ్రమను అభినందిస్తున్నాను. 

ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

మొత్తం దాదాపు 100 కోట్లతో చేపట్టిన పాలకుర్తి, బమ్మెర, వల్మీడి ఆధ్యాత్మిక, పర్యాటక కారిడార్ పనులు కూడా శరవేగంగా పూర్తి కావస్తున్నాయి.

65 కోట్లతో ఈ మూడు దేవాలయాల, ప్రాంతాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

మొన్ననే సీఎం కెసిఆర్  దయవల్ల రూ.25 కోట్లు పర్యాటక హోటల్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి.

అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు తెస్తాం. ఖర్చు చేస్తాం.

అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు!

సీఎం కెసిఆర్  దేవాలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారు.

దేవాలయాల జీర్ణోద్ధరణ, ధూప దీప నైవేద్యాలు, అర్చకులకు జీతభత్యాల పెంపు, అర్చకుల వయో పరిమితి పెంపు, యాదాద్రి వంటి అనేకానేక చర్యలతో దేవాలయాలు తెలంగాణలో దేదీప్య మానం అవుతున్నాయని మంత్రి వివరించారు.

మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి లు కూడా ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి  అభిషేకాలు చేశారు. అంతకుముందు ఈ రోజు పాలకుర్తి లోని పంచగుళ్ళ నుండి దేవాలయం వరకు తల0బ్రాలతో కళ్యాణానికి మంత్రి దంపతులు ఊరేగింపు గా తరలి వచ్చారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: