మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరది పద్నాలుగు వ డివిజన్ పరిధిలోని ఎల్కలపెల్లి గెట్ కు చెందిన నామని శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం NTPC కి బొగ్గు సరఫరా చేసే ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు ట్రైన్ చక్రాలు కింద పడి రెండు ముక్కలుగా అయి మరణించిన విషయం తెలిసిందే మరణించిన శ్రీనివాస్ నిరుపేద కుటుంబం మృతుడు భార్యతో ఎల్కలపెల్లి గెట్ లో అద్దె ఇంట్లొ ఉండేవాడిని శ్రీనివాస్ మరణం తో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో స్థానిక సర్పంచ్ సహాయం తో గ్రామపంచాయతీ పక్కన ఒక రూమును ఏర్పాటు చేయగా అందులో ఉంటుందని తినడానికి కూడా కష్టంగా మారిందని స్థానికులు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి తెలుపగా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం నూనె పప్పు కూరగాయలను ఫౌండేషన్ సభ్యులు కన్నూరి శంకర్ ద్వారా అందజేయడం జరిగిందని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు శ్రీనివాస్ మరణంతో ఒంటరిగా మారి ఉండటానికి ఇల్లు లేక దుఃఖంలో ఉన్న లక్ష్మీ ని స్థానికుల సహాయం తో గ్రామ పంచాయితీ పక్కన పునరావాసం కల్పించారని స్థానికులు తెలిపారు ఇంతటి దయానియా స్థితిలో ఉన్న లక్ష్మీ పరిస్థితిని చెప్పగానే సహాయం అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులకు మరియు అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు లక్ష్మీ కుటుంబానికి మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి కుటుంబాన్ని అదుకోవాల్సిందిగా దాతలను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మనాల ప్రభాకర్ పాల్గొన్నారు

Post A Comment: