ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు మంచినీల్ల లక్ష్మి నారాయణ కుటుంబానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి హోంగార్డు వెల్ఫేర్ ఫండ్ చెక్కును అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాల వల్ల హోంగార్డు లక్ష్మీనారాయణ మృతి చెందాడు. దీంతో హోంగార్డు వెల్ఫేర్ ఫండ్ తో పాటు తోటి హోం గార్డులు జమచేసిన రూ. 70 వేల చెక్కును గురువారం దివంగత హోంగార్డు సతీమణి రమకు ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ సహాయం ఉంటుoదని, శాఖ పరంగా రావలసిన ప్రయోజనాలన్నీ త్వరితగతిన వచ్చేలా చేస్తామని ఎస్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ బండ సతీష్ ఆర్ఎస్ఐ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Post A Comment: