మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
NTPC లోని ఒక ప్రయివేట్ హాల్ లో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుల సమావేశం జరిగింది..నగర అధ్యక్షులు *బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ *పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథి గ హాజరయ్యారు... అనంతరం ఆయన మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,అటువంటి పార్టీ కి సంబందించిన డివిజన్ అధ్యక్షులు పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య వారదులని, నాయకుడ్ని ప్రజలను అనుసంధానం చేస్తూ పార్టీని ముందుండి నడిపించే సైనికులని కొనియాడారు..తమ తమ డివిజన్ లో పేర్కొన్న ప్రతి సమస్య పై పోరాడి పార్టీ ని గడప గడప కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ బూత్ స్థాయి లో పార్టీ ని బలోపేతం చేసే పూర్తి బాధ్యత తమదే అని కోరారు..అలాగే పార్టీ లోకి నూతన చేరికలపై దృష్టి సారిస్తూ బూత్ లెవెల్ ఆఫీసర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించలని, పార్టీ పట్ల విధేయత, క్రమ శిక్షణ తో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు..అలాగే *జండా ఎత్తిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు మరియు డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ వారి వారి సూచనలు, సలహాలు తెలియచేసారు...ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు,అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు...

Post A Comment: