మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పట్టాలు ఇప్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి, జిల్లా ఎస్సి కమిటి సభ్యుడికి వినతిపత్రం ఇచ్చిన మందకోమురమ్మ కాలని వాసులు
మంద కొమరమ్మ కాలనీ వాసుల న్యాయమైన పోరాటానికి,
ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించేందుకు ప్రత్యక్షంగా అండగా ఉంటామని పెద్దపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వై యాకయ్య, జిల్లా ఎస్సీ కమిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూర్ మధు పెర్కోన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కాలనీ సమీపంలోని మంద కొమరమ్మ కాలనీ వాసులు బుధవారం గోదావరిఖనిలో పెద్దపల్లి జిల్లా సిపిఎం అధ్యక్ష, కార్యదర్శలు వేల్పుల కుమార స్వామి, వై యాకయ్య, జిల్లా ఎస్సీ కమిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూర్ మధు లను
కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంద కొమరమ్మ కాలనీ లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలు, దళిత కుటుంబాలకు అండగా నిలబడతామని, సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనే పోరాటాలలో భాగంగా త్వరలోనే కాలని స్థలం వద్దకు వచ్చి పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. యాజమాన్యంతో, ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని బొంకురి మధు పేర్కొన్నారు. మంద కొమరమ్మ కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు రాసపల్లి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రెంటాల రాధా, అవునూరి గౌరీ, కోండ్ర అరుణ, సరోజన, అంజలి, అర్చన, నర్సమ్మ, సుగుణ, దేవమ్మ, పద్మ, సుజాత, సారమ్మ, శనిగరపు పౌల్ ప్రదీప్, ఈర్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: