మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక గోదావరిఖని సాయి లీల కాన్ఫరెన్స్ హాల్లో రామగుండం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేశ్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షుల సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ పాల్గొన్నారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,,
ప్రతీ అధ్యక్షుడు ఒక సోల్జర్ గా డివిజన్లో గడపగడపకు తిరుగుతూ బూతు కమిటీలను వేసి ప్రజలను కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేయడంతో పాటు, టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించబోతున్న హాథ్ సే- హాథ్ జోడో కార్యక్రమం ద్వారా ధరణీ పోర్టల్ ద్వారా రైతులు పడుతున్న అవస్థలను ప్రతీ గడపకు చేరవేయాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణీ పోర్టల్ ను రద్దు చేస్తామని, రైతులకు ఉపయోగపడే పోర్టల్ ను అందుబాటులోకి
తీసుకువస్తామని అన్నారు..
ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు, కార్పోరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు ఎస్సీ, బీసీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ , NSUI నాయకులు పాల్గొన్నారు..

Post A Comment: