ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులు (వరంగల్ వెస్ట్) మరియు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని, పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రం, భాషిత్ నగర్ ప్రభుత్వ పాఠశాల, కొత్తూరు కమ్యూనిటీ హాల్ లో ఆయన గురువారం పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ తో కలసి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ తో పాటు కుడా ఛైర్మన్ సుందర్ రాజు యాదవ్, గ్రంధాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post A Comment: