మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలం లోని బీరసాగర్ గ్రామ ప్రజలు,విద్యార్థులు కాళేశ్వరం వచ్చి వెళ్ళడానికి,వారు పడుతున్న ఇబ్బందులు గ్రహించి, కాళేశ్వరం..బీర సాగర్ రోడ్ నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కు ఎంపీపీ రాణీబాయి రామారావు విజ్ఞప్తి చేశారు.సోమవారం భూపాలపల్లి ఇల్లందు క్లబ్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీరసాగర్ రైతులతో పాటు ఎంపీపీ, జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించగా, అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. రెండు,మూడు రోజుల్లో రోడ్ నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు...

Post A Comment: