మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ  సమ్మేళనం లో భాగంగా ఎస్ ఎల్ బి గార్డెన్ మంథని లో  నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ సమ్మేళనంలో అసెంబ్లీ ప్రబరి కాటంగురి అనిల్,బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని,ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపులో బూత్ కమిటీ  సభ్యుల పాత్ర చాల కీలక మైనదని,గ్రామ స్థాయిలో నుండి పార్టీని బలోపేతానికి కృషి చేయాలని,ప్రతి ఒక్క బూత్ స్థాయిలో గెలిపిస్తే,దేశం మొత్తం బీజేపీ పార్టీ గెలుస్తుందని,ప్రధాని మోదీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని.

గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి,కేంద్రం నిధులతోనే నని,గ్రామాలలో రోడ్లు,  డ్రైనేజీలు,సెంటర్ లైటింగ్ సిస్టం,కార్యాలయ భవనాలు, హరితహారం,స్మశాన వాటికలు,ఇంకుడు గుంతలు,కేంద్రం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, ప్రధాని ఆవాస్ యోజన పథకం మన రాష్ట్రలో వేస్తే ఇల్లు లేని ప్రతి పేదవానికి 3 లక్షలు వచ్చేవి కాని,కెసిఆర్ అవి రాకుండా అడ్డుకున్నాడని.ఏది ఏమైనా రాబోయే కొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నియంత, అవినీతి పాలనకు ప్రజలు స్వస్తి పలికి,వారి ఓటు తీర్పుతో బిజెపి అధికారం లోకి వస్తుందన్నారు.దళిత బంధు పేరుచెప్పి అందరిని దగా మోసం చేస్తున్నాడని,కెసిఆర్ కేవలం అధికార పార్టీ కి చెందిన నాయకుల కుటుంబాలకు మాత్రమే వర్తించేలా చేస్తున్నారన్నారు. మహాదేవపూర్ మండలం,  అన్నారం,నాగ పెళ్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల యువకులు సుమారు 50 మంది బిజెపి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ఇంచార్జ్ లు,ప్రధాన కార్యదర్శులు,సీనియర్ నాయకులు,వివిధ మోర్చా ల నాయకులు,బూత్ కమిటీ అధ్యక్షులు,సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: