మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గర్భిణీ మూట సంధ్య వారం రోజుల క్రితం ప్రసవం జరిగిందని ఇంట్లో తినడానికి బియ్యం నిత్యవసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్నట్లు గృహిణి సంధ్య సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా తెలుపగా సంధ్య యొక్క కుటుంబ పరిస్థితిని విని చలించిపోయిన మల్లేష్ ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కర్ రావు మరియు ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఎస్ వి సూపర్ మార్కెట్ అధినేత బిర మల్లేష్ ద్వారా 25కిలోల బియ్యం మరియు నిత్యవసర సరుకులు పండ్లు పంపియడం జరిగిందని సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన సంధ్య వారం రోజుల క్రితం ప్రసవించిందని ఆడపిల్లకి జన్మనిచ్చిన సంధ్య గాంధీనగర్ లోని ఒక అద్దె ఇంట్లో కిరాయికి ఉంటూ ఆర్థికంగా చితకలపడి వండుకొని తినడానికి కూడా ఇంట్లో బియ్యం నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి రావడంతో బాధిత కుటుంబానికి చింతల భాస్కర రావు.మరియు ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు సంధ్య కుటుంబానికి బియ్యం.నిత్యావసర సరుకులు మరియు పండ్లు.బ్రేడ్. అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులకు మరియు చింతల భాస్కర్ రావు కు బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు

Post A Comment: