మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఏసిడి బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు గోదావరిఖని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ *కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్*పాల్గొని మాట్లాడుతూ.. (ఎసిడి) అడిషనల్ కంజంక్షన్ డిపాజిట్ బిల్లులను రద్దు చేయాలని, పేద ప్రజలపై భారం పడుతుందని అన్నారు. ఈ బిల్లులను ప్రజలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం ఎసిడి బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అనంతరం ఎ.డి.ఇ కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో.. మహంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని ప్రకాశ్, గాదం విజయనంద్ , గట్ల రమేశ్, బొమ్మక రాజేశ్, చుక్కల శ్రీనివాస్, దాసరి విజయ్, నజిమ్, ఆసిఫ్ పాషా, అప్పసి శ్రీనివాస్, మేకల పొషం, పీక అరుణ్ కుమార్, బూర్ల శ్రీనివాస్, సమ్మెట స్వప్న, నల్లాల జ్యోతి, సంధ్య, వనమాల, సునీత, మేకల స్వప్న మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: