మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం నియోజకవర్గం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సట్టు భూమయ్య పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు తల్లిదండ్రులు ఇద్దరు రైతులు అందులో పెద్ద కుమారుడు సట్టు రాజశేఖర్ పుట్టుకతో దివ్యాంగుడు చాలా పేద కుటుంబo.దివ్యాంగుడైన క్రీడల్లో జాతీయ స్థాయి లో రాణిస్తున్నాడు ఆటలు అంటే మక్కువ పెంచుకున్న రాజశేఖర్ తోటి మిత్రులతో క్రికెట్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అటు బౌలింగ్,బ్యాటింగ్,ఫిల్లింగ్ లో తన ప్రతిభను కనబరుస్తూ గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు జాతీయ స్థాయి నుండి ( BDCA ) బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ నుండి అంతర్జాతీయ స్థాయిలో దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికై మరియు బహుమతులు సాధించిన సందర్భంగా సాయంత్రం 5:00 గంటలకు మన శాసన సభ్యులు రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ 33వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాజశేఖర్ ని అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:- తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులకు పెద్దపీట వేస్తూ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అలాగే రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణిస్తున్న సట్టు రాజశేఖర్ ని అభినందిస్తూ.. దివ్యాంగులను ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించి వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు .. అలాగే సట్టు రాజశేఖర్..

ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎమ్మెల్యే కోరు కంటి చందర్ కు 33 వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ కు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: