మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండము కమీషనరేట్ పరిది అంతర్గాo మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
* రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇంచార్జి కమిషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కృష్ణ రెడ్డి మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి అంతర్గాo పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి నుండి అంతర్గాo కు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేసి 04 ట్రాక్టర్లు ను 04 గురు వ్యక్తుల ను పట్టుకోవడం జరిగింది. ఇసుక ధర ప్రస్తుత మార్కెట్లో రూపాయలు: 12,000/- వరకు ఉంటుంది.
ఇసుక తరలిస్తూ పట్టుపడ్డ వారి వివరములు
1. అలకుంట సారయ్య, తండ్రి: ఎల్లయ్య, గ్రామము: అంతర్గాం ట్రాక్టర్ నెంబరు. TS 22 TA 0550
2. అలకుంట రమేష్, తండ్రి: పోచం, గ్రామము: అంతర్గాం ట్రాక్టర్ నెంబరు. TS 02 VB 0471
3. సంగం రమేష్, తండ్రి: రాజారామ్, గ్రామము: మురుమూరు ట్రాక్టర్ నెంబరు. TS 22 TA 0618
4. కానండ్ల రాకేశ్, తండ్రి: శంకరయ్య, గ్రామము: మురుమూరు ట్రాక్టర్ నెంబరు. TS 22 TA 0156
ఇసుక ధర: 12,000/- వరకు ఉంటుంది
పట్టుబడిన (04 ) గురు వ్యక్తులను మరియు (04) ఇసుక ట్రాక్టర్లను తదుపరి విచారణ నిమిత్తం కొరకు అంతర్గాo పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఎవరైతే ప్రభుత్వ అనుమతులు లేకుండా ధనార్జనే లక్ష్యం గా ఇసుక ఎక్కువ ధరలకు అమ్ముతు భూగర్భ జలాలు తగ్గేవిదంగా ఇసుకను తమ ఇష్టానుసారంగా తోడి రహస్యంగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా వారిని, చట్టవ్యతిరేక పనులు చేసేవారిని, ఉల్లంఘించే వారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు..

Post A Comment: