ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు.
మన ఊరు – మన బడి పనుల అభివృద్ధిపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం లో బుధవారం ఇంజినీరింగ్, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో నిర్వహించారు .
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.చేశారు.పనుల అభివృద్ధి, సాంకేతిక విషయాలపై తగిన సూచనలు ఇచ్చారు.ఆలస్యం పై అధికారుల పై అసంతృప్తి వ్యక్తం చేసారు.మండలాల వారిగ సంబంధిత అధికారులు పంచాయతీ ర్శాఖ సమన్వయంతో మోడల్ స్కూల్స్, ఉపాధి హామీ పనులను మండల స్పెషల్ ఆఫీసర్లు సర్పంచులతో సమన్వయము చేసుకొని పనులు త్వరగా పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని ఈ నెల 20 వ తేది వరకు పూర్తి చేసి, పూర్తి అయిన పనులకు వెంటనే బిల్స్ పేమెంట్ చేయాలన్నారు.
పనులు పూర్తి అయిన వెంటనే సంభందిత పాఠశాల గదులలో పూర్తి స్థాయిలో శుభ్రం చేసి పెయింటింగ్ ను ప్రారంభించాలని అన్నారు.
ఈ కార్యక్రములో అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి,వివిధ మండలాల స్పెషల్ ఆఫీసర్లు, డిఈఓ ఎండి అబ్దుల్ హై , ఎంఓఎంబి కోఆర్డినేటర్ పి. శ్రీనివాస్ , ఈఈ లు , డిఈ లు , ఏఈ లు ఎంఈఓ లు , ఎమ్మెన్ ఓలు లు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: