ముఖ్య సంచాలక్ / అనపర్తి సాయి తేజ
కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన జర్నలిస్టు వేముల శ్రీశైలం బుధవారం మరణించారు. వేముల శ్రీశైలం భూపాలపల్లి ప్రజా జ్యోతి పేపర్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. సూర్య దినపత్రికలో జర్నలిస్టుగా చేరిన అనంతరం ప్రజాజ్యోతిలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం మరణంతో కాటారం మండలంలో విషాదం నెలకొంది. ఆయన మృతితో జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీశైలం మృతి తీరని లోటన్నారు. శ్రీశైలంకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.

Post A Comment: