మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో, ఏప్రిల్ 9-4-2023 ఆదివారం రోజున జరిగే బ్రహ్మ గర్జన భారీ బహిరంగ సభ పోస్టర్ కరపత్రాలను,శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ ఆవరణం, కాళేశ్వరంలో మంగళవారం రోజున రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయ సారథి,కాళేశ్వరం బ్రాహ్మణ సంఘంతో కలిసి ఆవిష్కరించి,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బ్రహ్మ గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేశామని,శాఖ బేధం,ప్రాంతీయ బేదాలు లేకుండా,బ్రాహ్మణుల యొక్క హక్కులను రక్షించుకోవడానికి,రాష్ట్రంలో లక్షలాది బ్రాహ్మణులతో జరగబోయే బ్రాహ్మ గర్జన భారీ బహిరంగ సభకు అందరూ కలిసి రావాలని, బ్రాహ్మణుల కులవృత్తిగా,అర్చక పౌరోహిత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది మంది బ్రాహ్మణులకు,ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహాలు అందే విధంగా కృషి చేయడానికి బ్రాహ్మణులు బుజస్కందాలపై వేసుకొని నిర్వహిస్తున్న "కరుణిక" వ్యవస్థను గత ప్రభుత్వాలు రద్దు చేసి లక్షలాది బ్రాహ్మణులకు నష్టం చేకూర్చిందని సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా మనం ముందుకు కదలాలంటే అందరం కలిసి ఏకకంఠంతో నినాదించాల్సిన అవసరం ఏర్పడిందని దానికోసం హైదరాబాదు నగరంలో నిర్వహించే సభలో బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ శర్మ, ముక్తేశ్వర శర్మ,నగేష్ శర్మ, కృష్ణమూర్తి శర్మ,భాస్కర శర్మ, శ్రీకాంత్ శర్మ,శ్యాంశర్మ, ఫణీంద్ర శర్మ,రామకృష్ణ శర్మ, మహేష్ శర్మ,రఘు చారి, సాయి శర్మ,సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.

Post A Comment: