మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో ఉన్న రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కరించండి . సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య,  సిపిఎం పాదయాత్ర బృందం రెండో రోజు ఇందిరమ్మ కాలనీలో ప్రవేశించగా కాలనీవాసులు పూలమాలతోస్వాగతం పలికారు. అంతరం కాలనీలో పాదయాత్ర బృందం పర్యటించగా కాలనీవాసులు అనేక సమస్యలు తెలుపుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు ఇండ్లు నిర్మించుకొని పది సంవత్సరాలు దాటినా రోడ్లు డ్రైనేజీ నీటి సౌకర్యలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇన్ని నుండి వచ్చే వాడకపునీరు రోడ్లపై నిలిచి ఉండే పరిస్థితి ఉందని  నిలిచి ఉన్న మూలంగా దోమల వలన అలాగే పాలవుతున్నామని బోర్లు వేసిన చోట చెడిపోయిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. కొద్దిపాటిగా ఉన్న డ్రైనేజీ కాలవలో చెత్త కూరుకుపోయి దుర్వాసన వచ్చే పరిస్థితి ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థ లేని మూలంగా వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోయి ఇళ్లలో వచ్చే పరిస్థితి ఉన్నది. అనేకమార్లు అధికారులకు వెళ్ళబుచ్చిన పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇందిరమ్మ కాలనీ జంగాలపల్లి, పోరట్పల్లి రామయ్యపల్లి మల్కాపూర్ ,శాలపల్లే గ్రామాల వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది, సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను మున్సిపల్ అధికారులకు నివేదిస్తమని పరిష్కారం  చేయని యెడల ఆందోళన నిర్వహిస్తామని అందుకు ప్రజలు సమానత్వం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం వై యాకయ్య, వేల్పుల కుమార్ స్వామి ఏ మహేశ్వరి, సిహెచ్ లావణ్య, ఎన్ బిక్షపతి మరియు ఎన్టిపిసి రామగుండం ఏరియా కార్యదర్శి ఎం రామాచారి 2 డివిజన్ కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి,4వ డివిజన్, కార్యదర్శి, పి నాగలక్ష్మి, నాయకులు టి రవీందర్ ఎం కృష్ణారెడ్డి వి శ్రీనివాస్ రెడ్డి  కాదాసిమల్లేష్, రాధాకృష్ణ, అక్కపక శంకర్, ఏం సాంబయ్య పి సునీత, కే మహిపాల్ రెడ్డి  రమాదేవి, రాజేశ్వరి, ఫీర్ మహమ్మద్, పైముదా, భాస్కర్ వెంకటలక్ష్మి టి మంజుల  రేణుక  లక్ష్మి  భూలక్ష్మి  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: