చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని
శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో శివదీక్ష చేపట్టిన శివ స్వాములకు స్థానిక పాత్రికే యులు కొండమడుగు శ్రవణ్ కుమార్ వీణదంపతులు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అన్నదాత శ్రవణ్ కుమార్ వీణ మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదానం చేయడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. అన్నదానం చేసినదంపతులిద్దరు శివ స్వాముల ఆశీస్సులు తీసుకున్నారు.
అన్నదాతను శివ స్వాములు శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివ గురు స్వాములు ఆదిమూలం శంకర స్వామి, జూలుశంకరయ్య స్వామి, కుక్కల నరసింహ స్వామి, కోహెడ కృష్ణస్వామి, వెంకటరమణ, భీముగోని శ్రీరాములు, తోటి రమేష్, తీగుళ్ల వెంకటేశం, ఉప్పు కృష్ణ, ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ నరసింహ స్వామి, రమేష్ స్వామి తదితర శివ స్వాములుపాల్గొన్నారు.


Post A Comment: