మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/ హైదరాబాద్:ఈనెల 24-1-23 మంగళవారం రోజున కొండగట్టుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.24న ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి,11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు.కొండగట్టు లో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లిలో తెలంగాణ జనసేన ముఖ్యనేతలతో భేటీ అవుతారు.సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.అదే రోజు సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారు.ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ క్యాడర్కు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.
వారాహి ప్రత్యేకతలు..
ఇటీవల కాలంలో పవన్ సభలు,రోడ్ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో, వారాహి వాహనంపైనా చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.ఇక వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే,భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్ ప్రత్యేక సర్వర్‌కు రియల్ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు.

Post A Comment: