మహాదేవపూర్ మండల్ ప్రతినిధి/దూది శ్రీనివాస్
కాళేశ్వరం:పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి,అనుబంధ దేవాలయం,శ్రీ రామాలయంలో రేపటి గురువారం రోజు ఉదయం 8-30 నిమిషాలకు, దేవస్థానం ఆధ్వర్యంలో ధనుర్మాసంను పురస్కరించుకొని,ప్రత్యేక పీఠంపై స్వామివార్ల ఉత్సవ దేవత మూర్తుల ఆసీనులను గావించి,ప్రప్రథమంగా లక్ష తులసి దళాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.కావున స్థానికులు, భక్తులు,అయ్యప్ప స్వాములు ఇట్టి పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి,శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.

Post A Comment: