మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు ఎంపీపీ రాణీ బాయి రామారావు విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించినారని ఎంపీపీ రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం భూపాలపల్లి ఇల్లందు క్లబ్ లో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ కు ఎంపీపీ వినతి పత్రం సమర్పించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మండలంలోని రాపల్లి కోట, బెగుళూరు,సూరారం, బ్రాహ్మణ పల్లి గ్రామ పంచాయితీ లకు నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,
మహాదేవపూర్ మండల కేంద్రం లోని చౌకిదార్ చౌరస్తా లో గ్రంధాల భవన నిర్మాణం కు 20 లక్షలు మంజూరు చేయాలని,
గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం ముందు జాతీయ రహదారి 353 సీ గిరిజన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేయాలని,
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మహదేవపూర్ లోని అంగడి చింత నుంచి హనుమాన్ దేవాలయం వరకు సిమెంట్ రోడ్ నిర్మాణంకు 30 లక్షలు, చిన్న మసీదు నుంచి నూక లస్మన్న ఇంటి వరకు 20 లక్షలు,గుడాల శ్రీనివాస్ ఇంటి నుంచి చౌకిదార్ అప్జాల్ ఇంటి వరకు సీ. సీ రోడ్ నిర్మాణానికి 20 లక్షలు, శివజల వాటర్ ప్లాంట్ నుంచి గిర్ని కిషన్ ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణానికి 10 లక్షలు, శంశిర్ బెగ్ చౌరస్తా నుంచి ఇసాక్ హుస్సేన్ ఇంటి వెనుక కాలువ వరకు సీసీ రోడ్ నిర్మాణానికి 10 లక్షలు
మహాదేవపూర్ ప్రభుత్వ పాటశాల అవరనలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు 10 లక్షలు మంజూరు చేయాలని కోరారు.మహాదేవపూర్ లో ఏటిడబ్ల్యూఓ కార్యాలయం ప్రారంభం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు ఎంపీపీ రాణి బాయి రామారావు వినతి పత్రం సమర్పించగా మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీపీ పేర్కొన్నారు.


Post A Comment: