మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ యాష్ పాండ్ కు సంబంధించిన టిప్పర్ లారీ డ్రైవర్ల సమావేశం
గోస్కుల సురేందర్ అధ్యక్షతన ముఖ్య అతిధిగా బీజేపీ నేత కౌశిక హరి హాజరైనారు ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వారే డ్రైవర్లుగా పని చేస్తున్నారని, చాలి చాలని జీతాలకు పని చేస్తూ కష్టాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. డ్రైవర్ల సమస్యలపైన వేతనాల పెంపు పైన త్వరలోనే లారీ యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని ఓనర్లు సానుకూలంగా స్పందించాలని వారు కోరారు వారి స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని వారి కోసం ఎలాంటి పోరటానికైనా సిద్ధమేనని వారన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నిమ్మరాజుల రవి, కుక్క గంగాప్రసాద్, జరుపుల శ్రీనివాస్, పవన్,శెట్టి రాజశేఖర్ మరియు అధిక సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.

Post A Comment: